![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -438 లో... తను అంత సేపు పూజలో కూర్చొలేనని అపర్ణ చెప్పడంతో.. నేను కూర్చొని పూజ చేస్తానని సుభాష్ చెప్తాడు. వద్దు నేనిలా అవ్వడానికి కారణం తనే.. ఇప్పుడు నా బాగు కోసం పూజ చెయ్యడం ఏంటని అపర్ణ కోప్పడుతుంది. నేను పూజ చేస్తానని సుభాష్ అనగానే.. అయితే నేను ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అపర్ణ అంటుంది. వద్దు నేను చెయ్యనని సుభాష్ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత పూజలో నా కొడుకు, కోడలు కూర్చొని ఉంటారని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత రాజ్, కావ్య లు పూజలో కూర్చుంటారు. ఆ మాయకు ఇచ్చిన నగలు పాలలో కడిగి కావ్యకి ఇవ్వండి అని అపర్ణ చెప్తుంది. ఆ అపర్ణ చూసావా ఎలా కావ్యకి సపోర్ట్ చేస్తుందోనని అనామికతో వాళ్ళ పేరెంట్స్ అంటారు. చూసావా ఆ కావ్య ఎలా అందరిని తన వైపుకి తిప్పుకుందో.. నువ్వు అసలు తిట్లు పడడం తప్ప ఏమైనా చేసావా అని అంటారు. ఆ తర్వాత కనకం ఫ్యామిలీ వెళ్తుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ.. మీ అత్తయ్య గారిలో ఈ మార్పు రావడమని కనకం అంటుంది. చూస్తుంటే మమ్మల్ని కూడా ఒప్పుకున్నట్టే అనిపిస్తుందని కృష్ణమూర్తి అంటాడు. నువ్వు ఓపిక పట్టాలంటే ఏంటో అనుకున్నా కానీ నీ నిరీక్షణ ఫలించింది.. ఇంతకంటే ఏం కావాలని కావ్యతో కనకం చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కావ్య ఫ్యామిలీకి అపర్ణ మర్యాద ఇచ్చి మాట్లాడడం చూసిన రుద్రాణి.. ఆశ్చర్యంతో అలాగే చూస్తుంటుంది. ఏమైంది మమ్మీ అంటూ రాహుల్ అడుగుతాడు. మా వదినలో వచ్చిన మార్పుని చూడలేకపోతున్నాను.. తన భర్త చేసిన చేసిన తప్పుని దాచడానికి తన కోడలు ఎంత త్యాగం చేసిందని కావ్య పై మంచి ఇంప్రెషన్ వచ్చిందని రాహుల్ తో రుద్రాణి అంటుంది.
ఆ తర్వాత కావ్య దగ్గరకి రాజ్ వస్తాడు. ఇద్దరు అపర్ణ , సుభాష్ ల గురించి మాట్లాడుకుంటారు. రోజు రోజుకి వాళ్ళ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. మళ్ళీ మావయ్య మొన్నటి లాగా జీవితంపై విరక్తితో ఏదైనా చేసుకుంటే ఎలా? మావయ్య గారిని తన మనసులోని బాధని అత్తయ్యతో చెప్పమని చెప్తే.. అత్తయ్య అర్ధం చేసుకుంటుందని కావ్య అంటుంది. సరే అని సుభాష్ దగ్గరికి వెళ్లి అపర్ణ తో మాట్లాడమని రాజ్, కావ్య చెప్తారు. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి సుభాష్ వెళ్లి మాట్లాడతాడు. కానీ అపర్ణ కోపంగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో అసలు మాయ స్పృహ లోకి వచ్చిందని కావ్యకి అప్పు చెప్తుంది. ఆ తర్వాత అప్పు, కావ్యలు హాస్పిటల్ కి వెళ్లేసరికి రౌడీలు మాయని తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |